Tuesday, July 26, 2016

Download Telugu Stories Samethalu Androidapp

తెలుగు కథలు,సామెతలు మరియు పొడుపు కథలు

మనమందరం మన తెలుగులోని ఈ అపురూప కథలని మర్చిపోతున్నాం, ఇలాంటి కథలు నర్సరీల్లో పిల్లలకు నేర్పరు. మనమే చొరవచేసుకుని మన పిల్లలకి అలనాటి తెలుగు కథలను చెప్పి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దుదాం.


సామెతలు లేదా లోకోక్తులు (Proverbs) ప్రజల భాషలో మరల మరల వాడబడే వాక్యాలు. వీటిలో భాషా సౌందర్యం, అనుభవ సారం, నీతి సూచన, హాస్యం కలగలిపి ఉంటాయి. సామెతలు ఆ భాష మాట్లాడే ప్రజల సంస్కృతిని, సాంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. "సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు" అంటారు. సామెతలకు ఏ ఒక్కరినీ రచయితగా చెప్పలేము. ప్రజలు తమ అనుభవాల్లోనుంచే సామెతలను పుట్టిస్తారు.

సామెతలు ప్రసంగానికి దీపాల్లాంటివి. అవి సంభాషణకు కాంతినిస్తాయి. సామెతలో ధ్వని ఉంటుంది. ప్రసంగోచితంగా ఒక సామెతను ప్రయోగిస్తే పాలల్లో పంచదార కలిపినట్లుంటుంది. సామెతలు సూత్రప్రాయంగా చిన్న వాక్యాలుగా ఉంటాయి. ఇవి ఒక జాతి నాగరికతను చెప్పకనే చెబుతుంటాయి. ఇవి పూర్వుల అనుభవ సారాన్ని తెలియజేసే అమృత గుళికలు ("ఆకలి రుచి ఎరుగదు. నిద్ర సుఖమెరుగదు"). పండితులకు, పామరులకూ పెట్టని భూషణాలు ("ఊరక రారు మహానుభావులు"). సామెతలు ఒక నీతిని సూచింపవచ్చును ("క్షేత్రమెరిగి విత్తనం వెయ్యాలి, పాత్రమెరిగి దానం చేయాలి"). ఒక అనుభవ సారాన్ని, భావమును స్ఫురింపజేయవచ్చును ("ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి", "కడివెడు గుమ్మడి కాయైనా కత్తిపీటకు లోకువే"). ఒక సందర్భములో సంశయమును నివారించవచ్చును ("అందానికి కొన్న సొమ్ము అక్కరకు పనికొస్తుంది"). వ్యక్తులను కార్యోన్ముఖులను చేయవచ్చును ("మనసుంటే మార్గముంటుంది") ప్రమాదమును హెచ్చరించవచ్చును ("చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి"). వాదనకు ముక్తాయింపు పాడవచ్చును ("తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి"). హాస్యాన్ని పంచవచ్చును ("ఆత్రపు పెళ్ళికొడుకు అత్తవెంట పడ్డాడట").


పొడుపు కథలు అనగా, ఒక రకమైన సమస్య అనుకోవచ్చు. ఇవి మెదడుకి మంచి మేత. వీటిలో ఒక పొడుపు కథ అడగబడుతుంది, వాటికి జవాబు చెప్పడాన్ని విప్పడము లేదా విడుపు అంటారు.
తెలుగు భాషా సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానం ఉంది. వీటి సృష్టి కర్తలు పల్లె ప్రజలే. పండితులకు కూడ వీటిపై ఆసక్తి కలగడం వల్ల పద్యాలలోనూ పొడుపు కథలు ఉన్నాయి. విజ్ఞానం,వినోదం,ఆశక్తీ కలిగించే పొడుపు కథలంటే యిష్టపడని వారుండరు. ఇది పల్లె ప్రజలకు ఒక వినోదంతో కూడిన ఆట. పొడుపు కథలో చమత్కారం, నిగూఢ భావం యిమిడి ఉండటమే దీనికి కారణం. ఎలాగైనా ఇందులో రహస్యం తెలుసుకోవాలనె కుతూహలం ఒకవైపు, దీని గుట్టు విప్పి తన తెలివితేటలు నిరూపించుకోవాలనె తపన ఒకవైపు పొడుపు కథల వైపు మనిషి ఆకర్షించబడతాడు. ఆలోచనా శక్తి ని పదును పెట్టే పొదుపు కథలంటే పిల్లలు ఎక్కువ యిష్టపడతారు.

Download Telugu Stories Samethalu Free Android app 


 Download Telugu Stories Samethalu Free Android App


Featured Post

Full length 4K Video Thappattam Parai Attam: Captivating Folk Dance with...

Full length 4K Video Thappattam Parai Attam: Captivating Folk Dance with...